అదనపు భవనంలో ఏర్పాటు చేసిన కోర్టు ద్వారా కక్షిదారులకు సత్వర వేగవంతమైన న్యాయాన్ని అందించాలని హైకోర్టు న్యాయమూర్తి పుల్ల కార్తీక్ తెలిపారు. శనివారం సిద్దిపేట కోర్ట్ భవనంలోని 3,4 వ అంతస్తులో నూతనంగా నిర్మించిన సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ కం జుడిష్యల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ భవనాన్ని తెలంగాణ హైకోర్టు జడ్జ్ లు జడ్జ్ పుల్ల కార్తీక్, బి. విజయసేన రెడ్డి మరియు జస్టిస్ శ్రవణ్ కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ పుల్ల కార్తీక్ మాట్లాడుతూ.. సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవన నిర్మాణానికి కృషి చేసిన వారిని అభినందించారు. అదనపు భవనంలో ఏర్పాటు చేసిన కోర్టు