గత నెల రోజుల క్రితం..బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ సింగ్ యాదవ్ (34) అగర్వాల్ రబ్బర్స్ పరిశ్రమలో కాంటాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వెంటనే స్పందించిన MLA పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి 65 లక్షల నష్టపరిహారం అందించేలా ఒప్పించారు. పరిశ్రమ ప్రతినిధులతో అంగీకార పత్రాన్ని అందించారు. MLA క్యాంపు కార్యాలయంలో MLA చేతులమీదుగా.. మృతుడి కుటుంబ సభ్యులకు 60 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులను శుక్రవారం అందజేశారు. MLA GMR మాట్లాడుతూ.. ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలను పాటిస్తూ.. కార్మికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.