నందవరం లో రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో నిరాశ మరియు ఆగ్రహం నెలకొంది. ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అవగాహన కల్పించడానికి “ఇంటింటికి రికాల్ టీడీపీ మ్యానిఫెస్టో” అనే ప్రత్యేక నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక గారి ఆదేశాల మేరకు, నందవరం మండలంలోని గురుజాల,రాయిచోటీ గ్రామలలో మండల పార్టీ అధ్యక్షులు జే. శివారెడ్డి గారి అధ్యక్షతన గురుజాల,రాయచోటి గ్రామ పంచాయతీ నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగింది.