Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
తమిళనాడులో బస్సును దొంగిలించిన ఓ దొంగ ఏకంగా రాష్ట్రాలనే దాటించేశాడు. ఆంధ్ర పోలీసుల సహాయంతో చోరీకి గురైన బస్సును నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో పోలీసులు పట్టుకున్నారు. నిన్న చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కొత్త ఆర్టీసీ బస్సును ఒరిస్సాకు చెందిన నిరంజన్ సాహో అనే దొంగ బస్సును ఎత్తుకెళ్లాడు. బస్సు చోరీకి గురైనట్లుగా గ్రహించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిపిఎస్ ఆధారంగా బస్సును వెంబడించిన తమిళనాడు పోలీసులు ఆంధ్ర పోలీసుల సహాయంతో ఆత్మకూరు వద్ద దొంగను పట్టుకున్నారు. బస్సుతో సహా నిందితుడు నిరంజన్ సాహోను పోలీసులు చెన్నైకి తీసుకెళ్లారు.