హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ వద్ద హనుమకొండ పరకాల ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయింది అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు రైతులకు యూరియా ఇవ్వకుండా అధికారులు యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ అధిక ధరలకు అమ్ము కుంటున్నారని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులకు సరిపడా యూరియా అందించకపోతే రైతుల ఆగ్రహానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని రైతన్నలు హెచ్చరిస్తున్నారు