నాసిరకం మొక్కజొన్న విత్తనాలు విక్రయించిన మధు సాయి ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్ యజమానులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం తాడిపత్రిలో ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా ముద్దనూరు మండలం శెట్టివారి పల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు తాడిపత్రిలోని మధు సాయి ఫెర్టిలైజర్స్ షాపులో 007 సాహో మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి పంటలు సాగు చేశారు. సుమారు నూరు ఎకరాల్లో పంటను సాగు చేశారు. నాసిరకం విత్తనాలు కావడంతో పంట దిగుబడి రాలేదు. దీంతో ఫర్టిలైజర్ షాప్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. న్యాయం చేస్తానని ఏడీ రవికుమార్ రైతులకు హామీ ఇచ్చారు.