ఓయూ జేఏసీ ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు మళ్లీ ఈరోజు అరెస్ట్ చేశారు. మార్వాడీల దాడికి నిరసనగా నిన్న ఓయూ జేఏసీ ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నేడు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జేఏసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన జేఏసీ నాయకులను లాలాగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.