బిట్రగుంట రైల్వే స్టేషన్ పడమర పాత బుకింగ్ ఆఫీస్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు యాచకుడని గుర్తించారు. మృతుని వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. రెండు మూడు రోజులుగా ఇక్కడే సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.