చిలుకూరులోని అంతరగంగ వాగు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ సురమాంబ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గడ్డపారతో తాళం పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించి, హుండీని ధ్వంసం చేసి దాంట్లో ఉన్న సుమారు రూ.5,000 నగదు అపహరించారు. ఈ ఘటనపై ఈరోజు ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.