శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వినాయక చవితిని పురస్కరించుకుని విద్యార్థులు పాఠశాలలో మట్టి గణపతులను తయారు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాద్యాయులకు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు మాట్లాడుతు రంగు రంగుల ప్లాస్టర్ అఫ్ ప్యారిస్తో చేసినా విగ్రహా లు పర్యావరణానికి ఎంతో నష్టం కానీ చాలా చోట్లా అటువంటి విగ్రహాలే తయారు చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. మట్టి విగ్రహాలు వినియోగించి పర్యావరణాన్ని కాపాడాల్సిన భాధ్యత మనందరిపై ఉంది,పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థుల చేత మట్టి గణనాథులను చేయించి తల్లిదండ్రులకు అందజేశారు.