ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ పథకాలు అమలయ్యాయని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహం కోసం ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ద్వారా సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు