ఆశా కార్యకర్తల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలన్నారు వారికి కనీస వేతనం అమలు చేయాలని కోరారు.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.