కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, బ్రహ్మానందపురం గ్రామంలో, గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, స్థలాల్లో గృహాలు నేర్పించుకునేందుకు, తమకు అవకాశం కల్పించాలని, స్థలాల వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తాము పేదవారమని, అద్దిల్లులో అద్దె కొట్టుకోలేక, కుటుంబం పోషించుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, ఇదే విషయాన్ని నాయకులు వద్దకు ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా,, తమకు న్యాయం జరగలేదని. కరెంటు, నీటి సదుపాయం లేకపోయినా, పూరిగురుషులు వేసుకొని జీవిస్తామని ఆవేదన చెందుతున్నారు.