కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.గోపాలం, గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల-1 ఉపాధ్యాయుడు అంబటి రాంబాబు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ దినేష్ కుమార్, డీఈవో పీ.బ్రహ్మాజీరావు, డీఆర్వో పద్మలత చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈమేరకు వారిని పలువురు అభినందించారు.