కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 809 కేసులు పరిష్కారమైనట్లు జూనియర్ సివిల్ జడ్జి రూపశ్రీ తెలిపారు. క్రిమినల్ కేసులు 46, సివిల్ కేసులు 3, భరణం కేసులు 4, ఎస్టీసీ కేసులు 756 పరిష్కారమైనట్లు జడ్జి వివరించారు. ఇరు వర్గాలకు రాజీ కుదిర్చి ఈ కేసులను పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, పోలీసులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.