తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిజామాబాద్ రీజినల్ ఆఫీసర్ లక్ష్మణ్ ప్రసాద్ తెలిపారు. ప్రతి సంవత్సరం జిల్లాకు 2,000 మట్టి వినాయక ప్రతిమలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. 15 ఏళ్లుగా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేపడుతున్నామని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు