వైసిపి అధినేత వైయస్ జగన్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని వైసిపి కార్యకర్తలు మండిపడుతున్నారు. అన్నం పెట్టే రైతన్న కోసం వైసిపి పోరాటం చేయాలనుకుంటే పోలీసు 30 యాక్ట్ అమలు చేయటం ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైసిపి కార్యకర్తలను పోలీసులు అడ్డగించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆర్డిఓ కి వైసీపీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు.