ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కళ్యాణి వాగు కట్ట తెగిపోవడంతో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో సమావేశమై, నష్టపోయిన రైతుల వివరాలను తక్షణమే సేకరించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. అలాగే, రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ తరఫున తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతుల తరఫున మరియు ప్రజల తరఫున ప్రత్యేక ప్యాకేజీ కోసం సంబంధిత శాఖల మంత్రులు మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు