ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీసీహెచ్ఎస్ సనత్ కుమారి అన్నారు. అనపర్తిలో ఏఎన్ఎమ్లు, ఆశావర్కర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేల చర్యలు చేపట్టాలన్నారు.ఏఎన్ఎమ్లు గర్భిణులకు అవగాహాన కల్పించి ప్రసవాలకు ఆసుపత్రికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిటెండెండ్ డా.తాడి రామగుర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.