పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, బెల్లంకొండ మండలం ఏమ్మాజీగూడెం గ్రామంలో నిన్న ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టీ వీరలక్ష్మి అనే బాలిక వీడియోలు చూస్తుండగా ఒక్క సారిగా ఫోన్ పేలడం జరిగింది. విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది..ఈ ప్రమాదంలో బాలిక కుడిచేతి రెండు వేళ్ళు పూర్తిగా తెగిపోయాయి. బాలిక 5 వతరగతి చదువుతుందని, బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు.