కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సాహిత్య వర్గ ప్రతినిధులు మాట్లాడుతూ.. “కాళోజి తన కవిత్వంతో ప్రజల కష్టాలు, ఆశలు, ఆకాంక్షలకు స్వరమిచ్చారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకం” అని పేర్కొన్నారు. తరువాత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “కాళోజి నారాయణరావు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అగ్రగణ్యులు అని అన్నారు.