ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది కాపాడిన ఘటన దుండిగల్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గణేష్ నిమజ్జనం ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్న క్రమంలో దుండిగల్ చెరువులో ఓ వ్యక్తి ఆత్మహత్య కు యత్నించాడు. అయితే అక్కడే విధుల్లో ఉన్న హైడ్రా డీఆర్ఎస్ సిబ్బంది వెంటనే చెరువులోకి దూకి వ్యక్తిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.