నల్గొండ జిల్లా, నేరేడుకొమ్ము మండల పరిధిలోని పెద్ద మునిగల్ గ్రామంలో తుల్జా భవాని అమ్మవారి ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. ఆలయ పూజారి జీవన్ బకాత్ ఆధ్వర్యంలో అమ్మవారి దేవాలయం శిఖర కలశం సాంప్రదాయ బద్దంగా ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లాట్ పూజ, మేకపోతుల బలి వంటి కార్యక్రమాలలో నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు.