పలమనేరు: మండలం అర్బన్ సిఐగా మురళీమోహన్ పదవీ బాధ్యతలు స్వీకరించారని పోలీస్ స్టేషన్ వర్గాలు తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సిఐ నరసింహారాజును పలు ఆరోపణల నేపథ్యంలో అధికారులు విఆర్ కు బదిలీ చేశారు. గంగవరం రూరల్ సిఐగా ఉన్న మురళీమోహన్ ను అర్బన్ సిఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా నూతన సీఐ మురళీమోహన్ మాట్లాడుతూ, శాంతిభద్రతలు కాపాడుతానని ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.