శ్రీశైలం బస్టాండ్ లో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని జోబులో పరిశీలించగా ఆధార్ కార్డు అడ్రస్సులో ఆత్మకూరు పట్టణానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అని, అతనిది ఆత్మకూరు పట్టణంలో అర్బన్ కాలనీ అని ఉండడంతో ఆత్మకూరు పోలీసులకు శ్రీశైలం పోలీసులు సమాచారం అందించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అతని కుటుంబ సభ్యులు అతనిని తీసుకువెళ్లి మెరుగైన చికిత్సను అందించాలని పోలీసులు తెలియజేశారు.