శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా జంక్షన్ సమీపంలో సాధారణ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఒడిస్సా రాష్ట్రం బరంపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 21 కిలోల గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తి తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకొని ఘటనపై బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.