యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో త్రిబుల్ ఆర్ భూ బాధితులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మధ్యాహ్నం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్ భూ బాధిత రైతులకు సిపిఐ పార్టీ మద్దతు ఇవ్వడమే కాకుండా, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతులను సంతృప్తిపరిచి అభివృద్ధి చేయాలే తప్ప, రైతుల శవాల పైన రోడ్లు వేయకూడదని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తున్నానని చెప్తున్నా రాజకీయ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.