అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని 20వ వార్డులో శుక్రవారం డ్రై డే కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో బీబీ రవి ప్రసాద్ ఈవో ఆర్డీ సతీష్ కుమార్ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌస్ సాబ్, ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి సచివాలయ వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు కలిసి ఉరవకొండ పట్టణంలోని 20వ వార్డులో ఇంటింటికి తిరిగి జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రజల అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.