సదాశివనగర్ మండలంలోని జాతీయ రహదారి- 44లో సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కలిసి స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే వేగనియంత్రణ ఏర్పాట్లని, నిబంధనలు ఉల్లంఘిస్తే, స్పీడ్ లేజతో చాలన్లు జారీ అవుతాయాన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు ప్రధాన కారణాలు - ప్రతిరోజు వాహనాల తనిఖీలు అని తెలిపారు.