టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు నేడు అనగా మంగళవారం ఉదయం 11:30 నిమిషాలకు మహబూబాబాద్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆందోళన నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీని మాజీ సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిందన్నారు.