మడకశిర పట్టణంలో గురువారం నాపట్టు నా అభిమానం కార్యక్రమం పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీలు బి కే పార్థసారథి అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరయ్యారు. మడకశిరలో పట్టు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వారంలో ఒకసారి పట్టు వస్త్రాన్ని ధరిస్తే పట్టు పరిశ్రమను ప్రోత్సహించిన వారు అవుతామని అన్నారు.