అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎరువుల దుకాణాలను గురువారం విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీ బాలాజీ ఫర్టిలైజర్, సింధు ఫర్టిలైజర్, సాయి కృష్ణ ఫర్టిలైజర్, ధనలక్ష్మి సీడ్స్ అండ్ పెస్టీసైడ్ దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఎరువుల నిల్వలు, విక్రయాల గురించి ఆరా తీశారు. రూ.4,33,000 విలువ చేసే ఎరువుల నిల్వలకు సంబంధించి రికార్డులు లేకపోవడంతో తాత్కాలికంగా వాటి అమ్మకాలను నిలిపివేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఎం.నాగభూషణం తెలిపారు. యూరియా కొరత లేదని రూ.266 కంటే అధికంగా విక్రయిస్తే చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.