వినాయక చవితి సందర్భంగా అనకాపల్లిలో ఏర్పాటుచేసిన 126 అడుగుల అతి ఎత్తైన గణపతి విగ్రహం రెండు తెలుగు రాష్ట్రాలను అనకాపల్లి వైపు చూసేలా చేసింది, బుధవారం వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ లో పర్యావరణాన్ని కాపాడేలా పూర్తిగా మట్టి, వాటర్ కలర్స్ తో రూపొందించిన 126 అడుగుల గణపతి భక్తులకు దర్శనమిచ్చారు అనకాపల్లి పట్టణ చుట్టుపక్కలనుండి అధిక సంఖ్యలో భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారు.