కడప నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ఎన్. మనోజ్ రెడ్డి గారు ఈరోజు ఉదయం పలు డివిజన్లలో పర్యటించారు. Friday Dry Day కార్యక్రమం లో భాగంగా కమిషనర్ గారు ఇంద్రానగర్, వికలాంగుల కాలనీ మరియు పక్కిరిపల్లి ప్రాంతాలను సందర్శించారు. ఈ పర్యటనలో వార్డ్ స్పెషల్ ఆఫీసర్లు, శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అలాగే సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ గారు స్థానిక ప్రజలను కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా నీటి గుంతల్లో నిల్వలు లేకుండా చూసుకోవాలని, ప్రతి ఇంటికి వెళ్లి దానికి సంబంధించిన అవగాహన కల్పించాలని సచివాలయ సెక్రటరీలకు ఆదేశాలు ఇచ్చారు.