శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం తూముకుంట పారిశ్రామిక వాడలో కార్మికులకు ఒత్తిడి నిర్వహణ అవగాహన కార్యక్రమంను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి సైక్రియాటిస్ట్ డాక్టర్ జీవన విప్రో కేర్స్ సహకారంతో వాసవ్య మహిళా మండలి, కుశల్ ఆరోగ్య కేంద్రం తుమకుంట చెకపోస్ట్ వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైకీయాట్రిక్ డా. జీవన మాట్లాడుతూ అధిక పని భారం, సమయపట్టికలు, పని-వ్యక్తిగత జీవన సంతులనం లోపం, అలాగే ఆహారంలో ప్రోటీన్ లోపం కూడా ఒత్తిడికి కారణమవుతుందని పేర్కొన్నారు. క్రమమైన వ్యాయామం, సరైన ఆహారం, విశ్రాంతి పద్ధతులు పాటించడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చని సూచించారు