Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు గురుకుల విద్యాలయంలో విష జ్వరాల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. పాఠశాలలో 3 రోజులుగా సుమారు 12 మంది విద్యార్థులకు తీవ్ర జ్వరాలు రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విద్యార్థులకు జ్వరాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు DSP వేణుగోపాల్, వారి సిబ్బంది విద్యార్థినులను ప్రభుత్వ వైద్యశాలకు పోలీసు వాహనాలలోనే తరలించారు.