మడకశిర పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాల ప్రెషర్స్ డే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోమవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందిస్తూ సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.కార్యక్రమం అనంతరం తిప్పేస్వామితో కరచాలనం చేయడానికి విద్యార్థులు పోటీ పడ్డారు.