విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు శనివారం నగర భద్రతతో పాటు నగరం గుండా ఎటువంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా నగరంలో పలు ప్రదేశాలలో అధికారులు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తు, నగర భద్రతను మరింత పెంచేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారని పోలీస్ కమిషనర్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు