రాజేంద్రనగర్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో రాష్ట్ర మహిళా పోలీస్ తొలి సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మహిళా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.