ప్రకాశం జిల్లా టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు గురువారం వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Ganeshutsav.net వెబ్ సైట్ లో కమిటీ వివరాలు ఎన్ని రోజులు విగ్రహం ఏర్పాటు చేస్తారో వివరాలు పొందుపరచాలని చెప్పారు. మైక్ సెట్, ఎలక్ట్రిసిటీ అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని అల్లరిలో సృష్టించేందుకు ప్రయత్నిస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ప్రజలను హెచ్చరించారు.