Parvathipuram, Parvathipuram Manyam | Dec 30, 2024
గుమ్మలక్ష్మీపురం రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో సోమవారం మద్యాహ్నం మండల స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల వలన విద్యార్థులలో నైపుణ్య స్థాయిని గుర్తించవచ్చని, అలాగే ఆలోచన విధానాలను పెంపొందించొచ్చని అన్నారు. మండల లెవెల్ లో గెలుపొందిన వాళ్ళకి జిల్లా స్థాయిలో ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సుదర్శనరావు, ఎంఈఓ చంద్రశేఖర్ ఉపాధ్యాయులు ఉన్నారు.