సంగారెడ్డి బైపాస్ రహదారి పనులు త్వరగా పూర్తిచేయాలని, నాణ్యతగా చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో గురువారం రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు వారాలుగా రోడ్డు పనులు నిలిచిపోయిన హెచ్ఎండీఏ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. రోడ్డు పనులు సరిగా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.