బాపట్ల జిల్లా కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఉన్న ఎరువుల గోదామును కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల గోదామును పరిశీలించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. రైతులందరికీ ఎరువులు సక్రమంగా అందుతున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎరువుల కోసం వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన ఎరువులను అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.