నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వర్ని చౌరస్తా వద్ద గురువారం చోటుచేసుకుంది. బోయిగల్లికి చెందిన కిషన్, ఆర్ఆర్ చౌరస్తా నుంచి వర్ని చౌరస్తా వైపు నడుచుకుంటూ వస్తుండగా డీసీఎం లారీ డీ కొట్టింది. ఈ ఘటనలో కిషన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు.