Download Now Banner

This browser does not support the video element.

అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ ఫార్మా, బ్రాండిక్స్ కంపెనీల కార్మికులకు దసరా ,దీపావళి పండగలకు బోనస్ ఇవ్వాలని సిఐటియు నిరసన

India | Sep 23, 2025
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల అచ్యుతాపురం ఎస్ఈజెడ్, ఫార్మా, బ్రాండిక్స్ కంపెనీల కార్మికులకు దసరా, దీపావళి పండగలకు 20% బోనస్ ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కార్యదర్శి సోమనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బోనస్ చెల్లించాలని కోరుతూ అచ్యు తాపురంలో ప్రదర్శన నిర్వహించారు. లేబర్ అధికారులు జోక్యం చేసుకొని చట్ట ప్రకారం చెల్లించాల్సిన బోనస్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బోనస్ కార్మికుల హక్కు అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us