జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురువాలని కప్పతల్లి ఆటలు ఆడారు. ప్రతి యేటా జూన్ అమావాస్య రోజున ఆదివాసులు ఈ ఆట ఆడుతారు. ఇచ్చోడ, నేరడిగొండ, సిరికొండ ఆయ మండలలో గిరిజన చిన్నారులు ఒక కర్రకు కప్పలను కట్టి ఇంటింటికీ తిరుగుతూ గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు. మహిళలు హారతి పట్టి, కప్పకు, చిన్నారులకు స్నానం చేయించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని (బుడ్ బావేయ్) పండుగను చేస్తారు.