పలమనేరు: పట్టణంలోని 26 వార్డులలో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగిందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 800 మంది లబ్ధిదారులకు పెన్షన్లు తొలగించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలమనేర్ పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.