కామారెడ్డి : తండ్రి హత్య కేసులో కొడుకుకు జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలం జలాలపూర్ కు చెందిన విఠల్ ను కొడుకు సంగమేశ్వర్ హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని దూలానికి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసుల దర్యాప్తులో హత్య అని తేలడంతో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో సాక్ష్యాధారాలను సమర్పించడంతో నేరం రుజువైంది. ఈ మేరకు కోర్టు శిక్ష విధించి తీర్పునిచ్చింది.