నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసి, క్రైమ్ రికార్డులను, జనరల్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. కేసుల పరిష్కారం విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసులలో నిందితులుగా ఉన్న వారిపై నిఘా ఉంచాలన్నారు. డయల్ 100 కు తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.