శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలం కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేసిన పిఎన్ ప్రసాద్ పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు శేషగిరి బాబు అధ్యక్షత వహించారు. వారి 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్తానాన్ని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధార్థ, జడ్పిటిసి శ్రీనివాసరెడ్డి ,వివిసి.గిరి ఎన్ఎస్ఆర్వో, ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ లు నాగరాజు నాయక్, కుళ్లాయప్ప, గోపాల్, ప్రధానోపాధ్యాయులు ఎల్ ఆర్. గోపి, కల్లూరు ప్రధానోపాధ్యాయులు ప్రకాష్, గురు రాజారావు పాల్గొన్నారు.